ఈ నెల 25వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంతోపాటు అన్ని ఉపాలయాలను మూసివేస్తామని ఆలయ వైదిక కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. తిరిగి 26 ఉదయం ఆరు గంటలకు దుర్గగుడి తెరుస్తామని, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మహా నివేదన సమర్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12. 10 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు.