తిరుమల ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి-శ్రీకాకుళంరోడ్-తిరుపతి(07451-07452) ప్రత్యేక రైలు నడవనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ. కె. త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఈనెల 9వ తేదీ రాత్రి 8. 10 గంటలకు తిరుపతిలో బయలుదేరి మర్నాడు ఉదయం 9. 50 గంటలకు విశాఖ చేరుకొని ఇక్కడి నుంచి 10. 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12. 30 గంటలకు శ్రీకాకుళం రోడకు చేరుకోనున్నట్లు తెలిపారు.తిరిగి ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలు దేరి సాయంత్రం 5. 15 గంటలకు విశాఖ చేరుకుని ఇక్కడి నుంచి 5. 35 గంటలకు బయలు దేరి మర్నాడు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకోనున్నట్లు త్రిపాఠి తెలిపారు.
2 సెకెండ్ ఏసీ, 2 థర్డ్ ఏసీ, 10 స్లీపర్,5 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ రెండోతరగతి కమ్ లగేజీ బోగీలతో ఈ రైలు చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, విశాఖపట్నం,దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట,రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు,విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరుగూడురు, రేణిగుంట మీదుగా ప్రయాణం సాగించనున్నట్లు తెలిపారు.