తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.. దీని ఆధారంగా భక్తుల స్పందనను అంచనా వేసి ఆ తర్వాత పొడిగిస్తారు. ప్రస్తుతం తిరుమలలో భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. త్వరలో తిరుమల తరహాలో తిరుపతిలో కూడా గదులు కేటాయిస్తామన్నారు. దీంతో కొండపై గదులు దొరకని భక్తులకు దిగువన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న టైమ్ స్లాట్ టోకెన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 10.00 గంటలకు మార్చినట్లు ఈఓ తెలిపారు.