2023-24 విద్యా సంవత్సరం నుంచి బీటెక్ విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ను అమలు పరుచనున్నారు. ఈ విషయాన్ని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఇప్పటికే అన్నిరకాల ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మసీ విద్యార్థులతో పాటు బోధనా సిబ్బందికి ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. తాజాగా బీఈ/ బీటెక్ విద్యార్థులకూ ఈ తరహా అటెండెన్స్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.