ములాయం సింగ్ యాదవ్..మూర్తి దేవి, సుఘర్ సింగ్ యాదవ్ దంపతులకు 1939 నవంబరు 22న ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లాలోని సైఫాయ్ గ్రామంలో జన్మించాడు. ములాయం ఇటావాలోని కర్మ క్షేత్ర పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాల, షికోహాబాద్లోని ఎకె కళాశాల, బిఆర్ కళాశాల,ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో వరుసగా బీఏ, బీటీ, ఎం.ఎ. మూడు పట్టాలను పొందాడు.