ములాయం సింగ్ యాదవ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని మొదటి భార్య మాల్తీదేవి. 1980లో వీరికి వివాహమైంది. వారి కుమారుడు అఖిలేష్ యాదవ్. ఆ తర్వాత సాధనగుప్తాతో సంబంధం జరిపాడు. 2007లో సుప్రీంలో ఈ విషయం ములాయం అంగీకరించే వరకు ఎవరికి తెలియదు. వీరికి కుమారుడు ప్రతీక్ ఉన్నాడు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 2022 జూలై 9న గురుగ్రామ్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన మొదటి భార్య, అఖిలేశ్ యాదవ్ తల్లి మాలతి దేవి 2003లో కన్నుమూశారు.