యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మహమ్మదాబాద్ గ్రామంలో ఉండే సప్నా జైన్ (53)కు మానసిక స్థితి సరిగ్గా లేదు. దీంతో ఆమె 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెను తండ్రి గిరీష్ చంద్ గదిలో పెట్టి, గొలుసులతో బంధించాడు. కిటికీలో నుంచే అన్నం, నీళ్లు ఇచ్చేవారు. ఆమె అక్కడే మలమూత్ర విసర్జన చేయాల్సి వచ్చేది. గిరీష్ ఇటీవల చనిపోయాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను ఇటీవల విడిపించి, ఆస్పత్రికి తరలించారు.