రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ల క్రితం బాధిత దళిత మహిళ (25) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. దానిని వీడియో తీసి బెదిరించాడు. ఆమె వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడు. ఆమెను బంధించి, మత్తు మందిచ్చారు. నెల రోజులుగా సామూహిక అత్యాచారం చేశారు. భర్త పోలీసులకు ఫిర్యాదుతో ఆమెను గత నెల 27న వదిలేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.