ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల క్షేత్రం లో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దసరా నవరాత్రుల ముగియడం, భారీ వర్షాలు కురుస్తుండడంతో వంటి కారణాల వల్ల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల తాకిడి అంతంత మాత్రమే కనిపించింది. దీంతో భక్తులకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లభించింది.