భారత్‌కు వెళ్లే పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన కొత్త ట్రావెల్ అడ్వైజరీ సూచన మేరకు భారత్‌లో అత్యాచార కేసులు పెరుగుతున్నాయని, పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో లైంగిక హింస ప్రబలంగా ఉందని తెలిపింది. పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, అమెరికా నుంచి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.