ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుడికి ప్రార్థిస్తున్న మేక

national |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 11:43 AM

యూపీలోని కాన్పూర్‌లో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. ఇక్కడి ఓ పురాతన ఆలయంలో శివుడిని బాబా ఆనందేశ్వర్‌గా భక్తులు పూజిస్తుంటారు. ఇటీవల ఆలయలో హారతి ఇచ్చే సమయంలో ఓ మేక అక్కడకు వచ్చింది. ఎంతో భక్తిభావాన్ని ప్రదర్శిస్తూ మోకాళ్లపై వంగింది. హారతి ఇస్తున్నంత సేపు ఎంతో భక్తిభావంతో మెలిగింది. దాని ప్రవర్తన చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను డేవిడ్ జాన్సన్ అనే వ్యక్తి ఆదివారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa