జమ్మూకాశ్మీర్‌లోని టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సోమవారం ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. ముందుగా ఉగ్రవాదులు ఉన్న ఇంటి వద్దకు జూమ్ అనే ఆర్మీ జాగిలాన్ని పంపించారు. ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరిపారు. అయినప్పటికీ అది వీరోచితంగా పోరాడింది. ఆర్మీ బలగాలు కూడా ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. చివరికి ఇద్దరు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. బుల్లెట్ల గాయాలతో ఆ ఆర్మీ జాగిలం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.