ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఐసీసీ హెచ్చరించింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఫించ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కామెరున్ గ్రీన్ వేసిన బంతిని బట్లర్ ఇన్‌సైడ్ ఎడ్జ్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్ అయి కీపర్ వేడ్ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అంపైర్‌పై కెప్టెన్ ఫించ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఫించ్‌ను హెచ్చరించింది. మళ్లీ అదే పునరావృతం అయితే మ్యాచ్‌పై నిషేధం విధించడంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతలో, ICC హెచ్చరిక కారణంగా, ఫించ్ డీమెరిట్ కింద పాయింట్ తగ్గింపును పొందాడు.