విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. చంద్రగిరి మండలంలోని కొట్టాల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని పాఠశాలకు వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు పరుష పదజాలంతో దూషించాడు. గతంలో బాలిక తండ్రితో ఉన్న గొడవల కారణంగా వెంటపడి వేధించాడు. దీనిపై బాలిక ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ సందర్భంగా వారు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు.