రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ సంతోషి కుమారి మంగళవారం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి బొత్సతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆమె శృంగవరపుకోట నియోజకవర్గంలో గల రాజకీయ పరిస్థితులను మంత్రి బొత్సకు వివరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఓసారి శృంగవరపుకోటకు విచ్చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. జిల్లాలో ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తూ, ప్రజలకు అండగా నిలుస్తూ, మంచి మానవత్వం, రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు బొత్స సత్యనారాయణ అని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత పెంచే విధంగా ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె అన్నారు. ఇలాంటి వ్యక్తి విజయనగరం జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని సర్పంచ్ సంతోషి కుమారి తన హర్షం వ్యక్తం చేశారు.