అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బొమ్మక్క పల్లి గ్రామంలో నాయకుల పాలయ్య తోటలో బోర్ల నుండి పాతాళగంగ ఉబికి వచ్చింది. దీంతో ఆ రైతన్న ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాది భారీ వర్షాలు నమోదు కావడంతో అంతకంతకు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. దీంతో మోటార్లు వేయకపోయినా బోర్ల నుండి నీరు వస్తుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఈ ఏడాది పంటలకు నీరు ఎటువంటి డోకా ఉండదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa