దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 843.79 పాయింట్ల నష్టంతో 57,147.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257.45 పాయింట్లు నష్టపోయి 16,983.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.37 వద్ద నిలిచింది.