దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, లడ్డూప్రసాదం, తలనీలాలు కలిపి పదిరోజులకు రూ.6.34 కోట్లు ఆదాయం వచ్చింది. గత ఏడాదిలో రూ 4.08 కోట్లు వచ్చింది. లడ్డూ ప్రసాదాలు ద్వారా రూ. 2.48 కోట్లు, దర్శనం టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ. 20 లక్షలు ఆదాయం లభించింది.