ఇద్దరు మహిళల్ని నరబలి ఇచ్చిన ఘటన కేరళలో జరిగింది. తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, లైలా దంపతులు డబ్బుకు ఆశపడి నరబలి ఇచ్చారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి సాయపడ్డాడు. ఆ మహిళలను షఫీ సెప్టెంబర్ 26న కిడ్నాప్ చేశాడు. అనంతరం దంపతులతో కలిసి వారిని బలిచ్చి, మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. మృతులను పద్మం(52), రోస్లి(50)గా గుర్తించారు.