చిత్తూరు, కుప్పం: శాంతిపురం మండలం మొరసనపల్లి పంచాయతీలో మంగళవారం చిరుతపులి సంచరించిందన్న పుకార్లు షికార్లు చేశాయి. దీంతో రైతులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజర్ మధన్ మోహన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి జల్లిగానిపల్లి వద్ద పాద ముద్రలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాద ముద్రల ఆధారంగా చిరుతపులి కాదు జంగుపిల్లి అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించడంతో సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.