బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం ఈ నెల 18తో ముగియనుంది. తదుపరి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ నుంచి గంగూలీ తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ మూడేళ్లు కొనసాగడు. ఐసీసీ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు రాలేదు. మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని భావించినా కుదరలేదు.
బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నారు. ఈ నెల 18న ముంబైలో జరిగే వార్షిక సమావేశంలో 36వ బీసీసీ అధ్యక్షుడిగా బిన్నీ బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా జయ్ షా రెండోసారి కొనసాగనున్నారు. ఐపీఎల్ చైర్మన్ పదవిని కూడా గంగూలీ తిరస్కరించాడు. గంగూలీ బీజేపీలో చేరనందున బీసీసీఐ పదవిని పునరుద్ధరించలేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత గంగూలీని పక్కన పెట్టారని విమర్శించారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని అన్నారు.