ప్రజా అవసరాలు గుర్తిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక 5వ సచివాలయం పరిధిలోని మసీదు వీధి, కొత్తకోట వీధి, పాతకోట వీధి, కటువకాలువ వీధి, మొదలగు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష, జడ్పిటిసి రత్నశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షఫి పాల్గొన్నారు.