భారత నౌకాదళానికి చెందిన యుద్ధ విమానం మిగ్-29కే బుధవారం ప్రమాదానికి గురైంది. గోవా తీరంలో సముద్రంలో కుప్పకూలింది. సాంకేతిక సమస్య కారణంగానే మిగ్-29కే కుప్పకూలినట్లు భారత నౌకా దళం ఓ ప్రకటనలో తెలిపింది. ఎప్పటిలాగే సాధారణ పెట్రోలింగ్‌కు వెళ్లి, నేవీ బేస్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించింది. ప్రమాదాన్ని పసిగట్టి పైలట్ దూకేశాడని, అతడిని ఆసుపత్రికి తరలించామని వెల్లడించింది.