రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఓటిఎస్ ద్వారా పేద ప్రజలు ఇంటి కల నెరవేర్చుకోవాలని ఎంపిపి బండి నాగరాణి, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి బండి హేమసుంధర్ రెడ్డి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్ బొడిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు.
వెదురు కుప్పం మండలం , జక్కధన సచివాలయంలో సర్పంచ్ లు శ్రీనాథ్ రెడ్డి, కావేరి ల ఆధ్వర్యంలో బుధవారం ఓటిఎస్ పత్రాలను 24 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓ టి ఎస్ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మండలంలోనే జక్కధన, గంటావారి పల్లి పంచాయతీలలో ఓటిఎస్ పక్రియ లో ఆదర్శం కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు, డిడివో భాలసుబ్రమణ్యం, నాయకులు పెద్దబ్బ రెడ్డి, బాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.