గుంటూరు: నూజెండ్ల మండలం ఉప్పలపాడు కు చెందిన సిద్దల మరియబాబు (15) పదో తరగతి తర్వాత చదువు మానేసి తల్లిదండ్రులతో పొలం పనులకు వెళ్లేవాడు. బుధవారం పొలం పనులకు వెళ్లిన మరియబాబు తాగునీరు తీసుకురావటానికి పొలం నుంచి ఇంటికి వెళ్ళాడు. తిరిగి ఆలస్యంగా రాకపోవటంతో తండ్రి పెద్ద యేసయ్య మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలుడు ఆవేశంతో దగ్గరలో ఉన్న నేల బావిలో పరిగెత్తుకుంటూ వెళ్లి దూకి మృతి చెందాడు.