గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 103 వాలంటీరు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆర్ కేశవరెడ్డి బుధవారం తెలిపారు. ఖాళీల వివరాలు మండల కార్యాలయాల్లో తెలియజేస్తామని, 11 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరణ ఉంటుందన్నారు. 18న దరఖాస్తులను పరిశీలించి, 19, 20 తేదిల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.