తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయి 25ఏళ్లు దాటిన షోల పేరుతో కొడుకు, అల్లుడు ఆయనను ఇంకా హింసిస్తున్నారని విమర్శించారు. తండ్రిని చంపిన చంద్రబాబుతో , షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అని ప్రశ్నించారు.