కర్ణాటకలోని కృష్ణారాజపురంలో చందా, నరేందర్ సింగ్ అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రాజస్థాన్ నుంచి వలస వచ్చారు. నరేందర్ సింగ్ మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. విషయం తెలిసి చందా నిలదీయగా గొడవపడేవాడు. పోలీసు కేసు పెట్టినా అతనిలో మార్పు రాకపోగా, ఆమెను మరింత వేధించాడు. దీంతో చందా ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.