బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఇస్లాంపూర్ కాలనీ నందు రెండు వర్గాలు శుక్రవారం రాత్రి కట్టెలతో ఘర్షణకు దిగారు. ఘర్షణలో చాందు పీర్(24) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 7 మందికి తీవ్ర గాయాలవగా వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇరువురు సమీప బంధువులేనని కాలనీ వాసులు తెలియజేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం రెండు వర్గాల పై బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా పెట్టుకున్నారు.