గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో గత మూడు రోజుల క్రితం గుండాల తాండాకు చెందిన సుంకా నాయక్ ను కత్తితో పొడిచి హత్య చేసి, భార్య మంగమ్మను కట్టేతో తలపైన కొట్టి గాయపరిచిన కేసులో నిందితుడైన గుండాల తాండాకు చెందిన స్వామి నాయక్ ను శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని పాత గుత్తి రోడ్డులో అరెస్టు చేసినట్లు రెండవ పట్టణ సిఐ చిన్న గోవిందు విలేకరుల సమావేశం లో తెలిపారు. నిందితుడు స్వామి నాయక్ భార్య మంగమ్మ వరుసకు మరిది అయిన సుంకా నాయక్ తో చనువుగా ఉండడంతో పద్ధతి మార్చుకోవాలని భార్యకు చెప్పినా వినకపోవడంతో గత బుధవారం ఇద్దరు ఇంట్లో ఉండగా కత్తితో దాడి చేసి సుంకా నాయక్ కు హత్య చేసి, భార్యను కట్టేతో తలపై గాయపరచి నట్లు అంగీకరించాడన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, కట్టెను స్వాధీనం చేసుకుని నిందితున్ని కోర్టుకు హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారని సిఐ చెప్పారు.