గుంతకల్లు పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకారాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మహిళలకు సూచించారు. శనివారం పట్టణంలోని తిలక్ నగర్, మదీనా మసీదు కాలనీ, ఎల్లమ్మ తగ్గు ఏరి యాలలో కార్మికులు చేస్తున్న పారి శుద్ధ్య పనులను కమీషన్ బండి శేషన్న క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చెత్తను రోడ్లపై, కాలువలలో వేయ కుండా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినపుడు అందించాలని కోరారు. పట్టణ పరిశు భ్రతలో ప్రజలు భాగస్వామ్యం అయితేనే స్వచ్ఛ గుంతకల్లు సాధ్యం కాగలదని అందుకు సహకరించాలని కోరారు.