టర్కీలోని ఉత్తర బార్టిన్ ప్రావిన్స్ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించారు. నల్ల సముద్ర తీరంలోని అమాస్రాలోని ఫెసిలిటీలో శుక్రవారం పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పేలుడు సమయంలో 110 మంది గనిలో పని చేస్తున్నారని, అందులో 11 మందిని రక్షించామని టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. 74 మంది 300 మీటర్ల లోతులో చిక్కుకుపోయినట్లు తెలిపారు.