పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్‌లోని నిష్టర్ ప్రభుత్వ ఆసుపత్రి పైకప్పుపై కనీసం 200 వరకు కుళ్ళిన మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేగలు, రాబందులకు మేతగా ఉపయోగించేందుకు పైకప్పుపై ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక మృతులంతా బలూచిస్థాన్ వేర్పాటువాదులుగా ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.