రైతుల ఈకేవైసీ నమోదుకు శనివారమే ఆఖరు రోజు అని కారంచేడు మండల వ్యవసాయ శాఖ అధికారి కె. శివనాగప్రసాద్ చెప్పారు. ఈ విషయమై అవగాహన కల్పించడానికి ఆయన శుక్రవారం సాయంత్రం రైతులతో సమావేశమయ్యారు. మండలంలో పన్నెండు వేలకు మందికి పైగా రైతులు ఉండగా ఇప్పటివరకు కేవలం నాలుగు వేల మందే ఈ కేవైసీ చేయించుకున్నారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఏ రకమైన సంక్షేమ పథకాల లబ్ధి పొందాలన్నా రైతులు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అన్నారు. ఒక్క రోజులో గడువు ముగుస్తున్నందున రైతులు త్వరపడాలని ఆయన కోరారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.