సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఇటీవల టర్కీ పార్లమెంటులో ఓ బిల్లు రూపొందించారు. దీనిని టర్కీ ప్రతిపక్ష పార్టీ రిపబ్లికన్ పీపుల్స్‌కి చెందిన ఎంపీ బురాక్ ఎర్బే తీవ్రంగా వ్యతిరేకించారు. గురువారం చేపట్టిన చర్చలో వినూత్నంగా నిరసన చేపట్టారు. తన ఫోన్‌ను పార్లమెంట్‌లో సుత్తితో పగులగొట్టారు. సోషల్ మీడియాను ప్రభుత్వం నియంత్రించడం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు.