ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయిన వారిపాలెంలో తల్లిని హతమార్చిన తనయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 12:35 PM

చీరాల మండలం బోయినవారిపాలెంలో ఘోరమైన నేరం జరిగింది. తనకు కాకుండా తన చెల్లెలికి మూడు సెంట్ల స్థలం ఇచ్చిందన్న కక్షతో సొంత తల్లిని కుమారుడే కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు ఈపూరుపాలెం పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై జనార్ధన్ కథనం ప్రకారం ఆ గ్రామానికి చెందిన పెరుగు సుబ్బులుకు కొడుకు కూతురు ఉండగా ఆమె తనకు చెందిన మూడు సెంట్ల స్థలాన్ని కుమార్తెకు రాసిచ్చింది. చాలాకాలంగా ఈ విషయమై తల్లితో గొడవ పడుతున్న కుమారుడు పెరుగు శ్రీనివాసరావు బుధవారం అర్ధరాత్రి ఆమెపై కర్రతో దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దీంతో డెబ్బై ఏళ్ల వృద్ధురాలైన సుబ్బులు తీవ్రంగా గాయపడగా చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సుబ్బులు శుక్రవారం ఉదయం మృతి చెందింది. సుబ్బులు మనవడు పెరుగు అశోక్ ఈ మేరకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు పరారీలో ఉన్నారని ఎస్సై చెప్పారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com