హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో పోలీసుల జరిపిన దాడిలో ఇరాన్ యువతి మహ్సా అమిని (22) చనిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడి పోలీసుల వ్యవహార శైలిపై ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా నిరసనలో పాల్గొన్న ఇరాన్ నటి పాంటియా బహ్రామ్(52)ను ఆ దేశ పోలీసు బలగాలు నిర్బంధించాయి. పోలీసుల నిర్బంధంలో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేయగా, వైరల్ అవుతున్నాయి.