బీహార్ రాష్ట్రం చాప్రాలోని ఓ యూనివర్సిటీలో బీఏ విద్యార్థి రాసిన జవాబు చూసి టీచర్లు షాక్ అయ్యారు. ఇటీవల పరీక్షలో మద్యపాన నిషేధం గురించి ప్రశ్న వచ్చింది. దీనికి కృపాసింధు అనే విద్యార్థి ఫన్నీగా ఆన్సర్ రాశాడు. భోజ్‌పురి స్టార్ కేసరిలాల్ యాదవ్ నటించిన 'నాథునియా' పాట లిరిక్స్‌ను సమాధానంగా రాసేశాడు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. జాతిరత్నం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.