కార్తిక మాసంలో అక్టోబరు 31, నవంబరు 7, 11, 14, 21 తేదీల్లో పంచక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సిద్ధేశ్వరం, భైరవకోన, నారాయణస్వామి మఠం, మాలకొండ, నర్రవాడ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్తామన్నారు. టికెట్టు ధర పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 200, ప్రొద్దుటూరు నుంచి అరుణాచలానికి ఈ నెల 30, నవంబరు 6, 7, 13, 20 తేదీల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.