విశాఖ గర్జన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన ఆమె నేరుగా నోవోటెల్ కు వెళ్లి కాసేపు సేద తీరారు. అనంతరం భారీ వర్షం పడుతున్నప్పటికీ విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనసం దోహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు అభివాదం చేసి వికేంద్రీకరణకు జై అంటూ నినాదాలు చేశారు.