నిమ్మరసం వల్ల ఎన్ని లాభాలున్నాయో, ఎక్కువగా తాగితే అన్ని నష్టాలూ ఉంటాయి. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రాశయం ఎక్కువగా పని చేస్తుంది. అందువల్ల మూత్రాశయంపై అధిక ఒత్తిడి వల్ల మూత్రాశయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల చిగుళ్లు కూడా దెబ్బతింటాయి. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.