సిత్రాంగ్ తుఫాను ముప్పు కారణంగా రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉత్తర తమిళనాడు, కోస్తా తీరాల దిశగా రానుందని వాతావరణ నిపుణులు తెలిపారు.