రంగులేసుకున్నంత మాత్రానా చరిత్ర మారిపోదు. కనకదుర్గ ఫ్లైఓవర్ తెలుగుదేశం పార్టీ 12 ఏళ్ల కృషి ఫలితం అని టీడీపీ నాయకులూ బుద్దా వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... సుదీర్ఘంగా సాగిన ఉద్యమం తరువాత ప్రజల కష్టాలు తీరాయి. ఫ్లైఓవర్ కోసం చేసిన ఉద్యమం లో ముందుండి పోరాడినందుకు దక్కిన ఫలితం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఎప్పుడు ప్రభుత్వం రంగులేసుకొని తామే కట్టించాం అన్నట్లు ప్రచారం చేసుకున్నంత మాత్రాన ప్రజలకి నిజాలు తెలియవా...? అని ప్రశ్నించారు.