ఫేస్ బుక్ , టెలిగ్రాం, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ , తదితర సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటున్నారా !జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది అని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలలో ఉంచిన లింకుకు ఆకర్షితులై ఎవరైనా ఆ లింకు ను క్లిక్ చేసిన ఎడల ఆలింకు నందు మీరుపెట్టిన డబ్బుకు రెట్టింపు డబ్బు కొద్ది నిమిషాలలో పొందవచ్చు అంటూ మిమ్మల్ని మోసం చేస్తారు. మీ యొక్క బ్యాంకింగ్ వివరాలు అనగా UPI లేదా అకౌంటు వివరాలు, ఖాతా వివరాలు ఇటువంటి లింకుల యందు ఎంటర్ చేయకండి. ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే 1930 కు లేదా http://cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గుంటూరు జిల్లా ప్రజలకు తెలియజేసారు.