ఎదుటి వారికి చెడు చేస్తే, మనకు కూడా అదే ఫలితం ఎదురవుతుందని చాలా మంది నమ్ముతారు. సరిగ్గా ఇలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులో మహిళ అని కూడా చూడకుండా ఓ వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కింద పడేసి కొట్టాడు. అయితే ఈ దారుణాన్ని కారులో వచ్చిన కొందరు చూశారు. మహిళను కొడుతున్న వ్యక్తిని అడ్డుకుని అతడిపై దాడి చేశారు. పరుగులు పెట్టించి, చితకబాదారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియలేదు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడికి తగిన శాస్తి జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.