కొంత మంది చోర కళలో నైపుణ్యం సంపాదిస్తారు. కన్ను మూసి తెరిచే లోపే మనకే తెలియకుండా మన జేబు ఖాళీ చేస్తారు. తాజాగా క్యూలో నిలబడిన మహిళ నుంచి ఓ దొంగ ఫోన్ దొంగిలించాడు. చాకచక్యంగా ఫోన్ కొట్టేసి అక్కడి నుంచి జారుకుందామని అనుకున్నాడు. అయితే అతడికి ఊహించని షాక్ తగిలింది. ఓ వ్యక్తి ఆ దొంగను పట్టుకుని అతడి నిర్వాకాన్ని బయటపెట్టాడు. ట్విట్టర్‌లో వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దొంగకు తిక్క కుదిరిందని కొందరు, దొంగతనం ఒక ఆర్ట్ అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa