ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. సోమవారం ఆమె ఇంట్లోకి చొరబడి రెండు కార్లను ధ్వంసం చేశారు. దాడులలో ధ్వంసమైన కార్ల ఫొటోలను స్వాతి మలివాల్ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. "మీరు ఏమి చేసినా, నేను భయపడను" అని రాశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు దృష్టిసారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.