ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 01:50 PM

బాపట్లలోని యారకాలువ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత కొద్దిరోజులు కురుస్తున్న భారీ వర్షాలకు నీరు అధికంగా చేరటంతో వరద ఉధృతి ఎక్కువైంది. వరద ఉధృతి కారణంగా యారకాలువ బ్రిడ్జి సమీపంలోకి నీరు చేరింది. నీటి ప్రవాహం ఎక్కువైతే బ్రిడ్జి పైకి నీరు చేరుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుగుండం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఈ ప్రాంతంలోని ప్రజలతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com