వైసీపీ నేతలు, విశాఖలో ఉద్రిక్తతలు సృష్టించారని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని చేస్తున్నారుని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ఒకటో, రెండో, మూడో కృష్ణుడిలాగా వైసీపీ మంత్రులు అంబటి, అమర్, కొట్టు, బొత్స సత్యనారాయణలు ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు?.. 151 మందిలో మొలతాడు కట్టిన మగాళ్ళు నలుగురేనా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ వద్ద బానిసత్వం చేస్తోంది ఈ నలుగురేనా ..? అంటూ ఎద్దేవా చేశారు. వారు కనీసం రాజకీయ నాయకులుగానైనా బ్రతకాలని సూచించారు. వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా? అని గాదె వెంకటేశ్వరావు ప్రశ్నించారు.