ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో పేద ప్రజలు ఆకలితో చనిపోతున్నారని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ కర్నూలు జిల్లాకు వస్తుంటే హడావిడిగా సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటన చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు కాదు ఒక్కో జిల్లాను ఒక రాజధానిగా చేసుకోండి అంటూ యెద్దేవా చేశారు. రైతుల మోటార్‌లకు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారని అన్నారు. పేదవాడి ఆకలి తీర్చని మోహన్ భగవత్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో పెను మార్పులు రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజల నాడి మారిందని.. జగన్‌కు ఈసారి సీట్లు రావని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు.